రూపాయి25 పైసలు పతనం

10 Jan, 2017 00:59 IST|Sakshi
రూపాయి25 పైసలు పతనం

ముంబై: దేశ ఆర్థిక వృద్ధిపై ఆందోళన కారణంగా రూపాయి 25 పైసలు పతనమైంది. కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం 25 పైసలుక్షీణించి 68.21 వద్ద ముగిసింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు బాగా ఉండటంతో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు అంచనాలు బలంగా మారడం, కంపెనీలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ బాగా పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచాయి. విదేశీఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ, విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలపడడం, స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకుల మధ్య ట్రేడ్‌కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు బలహీనంగా ఉండటంతో ఫారెక్స్‌ మార్కెట్లో సెంటిమెంట్‌ దెబ్బతింది.

మరిన్ని వార్తలు