రూపాయి మరో 14 పైసలు పతనం

18 Apr, 2018 09:59 IST|Sakshi

సాక్షి,ముంబై:  మంగళవారం ఏడు నెలల కనిష్టానికి చేరిన దేశీయ కరెన్సీ   రూపాయి నేడు (బుధవారం) మరింత బలహీనపడింది. డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 65.78 రూపాయలకు పడిపోయింది.  దీంతో తాజాగా మరోసారి ఏడు నెలల కనిష్టాన్ని తాకింది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్‌ డిమాండ్ పెరరగడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ బలపడిందని  ట్రేడర్లు చెప్పారు.  చమురు ధరలు, గ్లోబల్  ట్రేడ్‌ వార్‌ ముప్పుకు తోడు దేశంలో కరెన్సీ కొరత , వాణిజ్యలోటు తదితర అంశాలు రూపాయిని బలహీనపరుస్తున్నాయని ఎనలిస్టులు చెప్పారు. నిన్న, రూపాయి 15 పైసలు క్షీణించి 7 నెలల కనిష్ఠానికి 65.64 వద్ద ముగిసింది. కాగా గత మూడు ట్రేడింగ్ సెషన్స్‌లోనే  రూపాయి 1 శాతం నష్టపోయింది.  కీలక మద్దతు స్థాయిని 65.50 బ్రేక్‌ చేసింది. ఆసియలో ఫిలిప్పీన్స్ పెసో తర్వాత మనదే వరస్ట్‌ ఫెర్‌పామింగ్‌ కరెన్సీ అట.

మరిన్ని వార్తలు