29 పైసలు క్షీణించిన రూపాయి

4 Mar, 2014 02:04 IST|Sakshi
29 పైసలు క్షీణించిన రూపాయి

 ముంబై: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో దేశీ కరెన్సీపైనా ప్రతికూల ప్రభావం పడింది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 29 పైసలు నష్టపోయి 62.04కు దిగజారింది. గడిచిన రెండు వారాల వ్యవధిలో ఇదే అత్యధిక క్షీణత కావడం గమనార్హం. డిసెంబర్ క్వార్టర్‌లో జీడీపీ గణాంకాలు నిరుత్సాహపరచడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

>
మరిన్ని వార్తలు