కరోనా డ్రగ్ వైఫల్యం, రూపాయి బలహీనం

24 Apr, 2020 16:39 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి పతనాన్ని నమోదు  చేసింది. డాలరు మారకంలో ఆరంభంలో రూపాయి 76.30 వద్ద ప్రారంభమై, అనంతరం మరింత బలహీన పడి  76.47 స్థాయిని టచ్ చేసింది.  చివరకు 40 పైసలు క్షీణించి  76.46 వద్ద స్థిరపడింది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.06 వద్ద ముగిసింది. కరోనావైరస్ కోసం యాంటీవైరల్  డ్రగ్ వైఫల్యం వార్తల తరువాత మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు. డాలర్ ఇండెక్స్ 0.31 శాతం పెరిగి 100.74 కు చేరుకుంది. అటు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో రోజంతా నష్టాల మద్య కదలాడిన సూచీలు రెండు రోజుల లాభాలను పోగట్టుకన్నాయి. చివరికి సెన్సెక్స్ 536 పాయింట్లు  కోల్పోయి 31327 వద్ద, నిఫ్టీ 160  పాయింట్లు క్షీణించి  9154వద్ద ముగిసింది. (5 సెకన్లలో కరోనా వైర‌స్‌ను గుర్తించవచ్చు!)

ప్రధానంగా కరోనా వైరస్ వ్యాధి నివారణలో యాంటీవైరల్ డ్రగ్ విఫలమైందన్న వార్తతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు. కరోనావైరస్ కేసుల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ చెడ్డ వార్త అయినా రూపాయిని బలహీనపరుస్తోందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. పెట్టుబడి దారులందరూ, కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారనీ, కానీ ఔషధాల అభివృద్ధిలో సందేహాలు సెంటిమెంట్ ను దెబ్బ తీస్తున్నాయని, దీంతో ఫారెక్స్ చంచలంగా మారిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 27 లక్షలకు పైగా చేరగా,  భారతదేశంలో ఇది 23 వేలను దాటింది.  (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!)

చదవండి : రెండు రోజుల లాభాలకు స్వస్తి

మరిన్ని వార్తలు