55 పైసలు ఎగిసిన రూపాయి

7 Apr, 2020 15:51 IST|Sakshi

 లాక్ డౌన్ లో  ఫారెక్స్ ట్రేడింగ్ వేళల్లో మార్పులు

పుంజుకున్న రూపాయి

సాక్షి, ముంబై:  కొత్త ఫారెక్స్ ట్రేడింగ్ గంటలు అమల్లోకి రావడంతో  దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో భారీ పుంజుకుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో  లాభాలను అందిపుచ్చుకున్న  భారతీయ రూపాయి అమెరికా డాలర్‌తో  పోలిస్తే   మంగళవారం  55 పైసల లాభంతో  75.63 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో రూపాయి 75.57 -75.99 మధ్య ట్రేడయింది. శుక్రవారం 76.13 వద్ద స్థిరపడింది. మహావీర్ జయంతి కారణంగా సోమవారం  ఫారెక్స్ మార్కెట్లకు సెలవు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం ఊహించిన దానికంటే ఎక్కువగా వుంటుందన్న అంచనాల మధ్య భారీ ఉత్పత్తి కోతలు అవసరమవుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ముడి ఉత్పత్తిదారులు ఉత్పత్తిని తగ్గించడానికి అంగీకరిస్తారనే ఆశతో గ్లోబల్ ఆయిల్ ధరలు ఈ రోజు పెరిగాయి. ముడి చమురు 2.4 శాతం పెరిగి బ్యారెల్ కు 33.85 డాలర్లుగా వుంది.  కీలకమైన హాట్‌స్పాట్లలో కరోనా వైరస్ వ్యాప్తి మందగించిన సంకేతాలపై గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. 2300 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ 30వేల స్థాయిని టచ్ చేసింది. అలాగే నిఫ్టీ కూడా 700 పాయింట్లు ఎగిసి 8800 స్థాయిని తాకింది.  

కోవిడ్-19 విస్తరణ, దేశవ్యాప్తంగా  మార్చి 25 నుంచి దేశం 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో  బాండ్లు ,  విదేశీ మారకద్రవ్యం  ట్రేడింగ్ వేళ్లలో కీలక మార్పులను చేసిన  సంగతి తెలిసిందే.  అంతకుముందులా ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు కాకుండా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకే పరిమితం  చేసింది. అటే మార్కెట్ ట్రేడింగ్ గంటలను నాలుగు గంటలు తగ్గించింది. సవరించిన ట్రేడింగ్  వేళలు ఏప్రిల్ 17 వరకు అమల్లో వుంటాయి.

>
మరిన్ని వార్తలు