ఆరంభలాభాల్ని కోల్పోయిన రూపాయి

3 Jun, 2020 11:48 IST|Sakshi

క్రూడాయిల్‌ ధరలు పెరుగుదలే కారణమంటున్న నిపుణులు

డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం ఆరంభ లాభాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 3నెలల గరిష్టానికి చేరుకోవడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(75.36)తో పోలిస్తే 33పైసల లాభంతో 75.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం గం.11:30ని.లకు ఉదయం లాభాల్ని కోల్పోయి 14పైసలు బలపడి 75.22 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

‘‘ ప్రపంచ, దేశీయ ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో  రూపాయి భారీగా బలపడింది. కరోనా కట్టడిలో భాగంగా దేశీయ ఆర్థిక వ్యవస్థను క్రమంగా అన్‌లాక్‌ చేయడం కూడా రూపాయికి కలిసొచ్చింది. చైనాతో జనవరిలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉపసంహరిచుకోలేదు.’’ రిలిగేర్‌ బ్రోకింగ్‌ సంస్థ కరెన్సీ రీసెర్చ్‌పర్సన్‌ సుగంధ్‌ సచ్‌వేద్‌ తెలిపారు.

మన మార్కెట్‌ ఇప్పుడు ప్రపంచమార్కెట్‌ ర్యాలీకి అనుగుణంగా రాణిస్తుందని ఆయనన్నారు. రూపాయి ప్రస్తుత క్షీణత రానున్న రోజుల్లో మరింత బలపేందుకు సహాయపడుతుందుని సచ్‌దేవ్‌ అంటున్నారు. ప్రస్తుతానికి స్వల్పకాలిక దృష్ట్యా రూపాయి బలంగా ఉందని తొందర్లోనే 74.80మార్కుకు చేరుకుంటుందని సచ్‌దేవ్‌ అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు