రూపాయి మళ్లీ ఢమాల్‌!

31 Aug, 2018 09:58 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. శుక్రవారం రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడింది గురువారం నాటి ముగింపుతో పోలిస్తే మరింత దిగజారిన రూపాయి మరోసారి ఆల్‌ టైం కనిష్టానికి చేరింది.  విశ్లేషకులు అంచనా  వేసినట్టేగానే ఆరంభంలోనే డాలరు మారకంలో  రూపాయి 71 స్థాయిని టచ్‌ చేసింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం 70.74 వద్ద ముగిసింది.  అటు చైనా దిగుమతులపై మరిన్ని టారిఫ్‌లను విధిస్తారనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఆసియా కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. జీడీపీ అంచనాలు, భారీగా పెరిగిన చమురు ధరలు రూపాయి విలువను ప్రభావితం చేశాయని ట్రేడర్లు చెబుతున్నారు.

ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ నిధుల స్థిరమైన ప్రవాహం, దేశీయ కరెన్సీపై కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న భయాలు రూపాయిని పతనం దిశగా లాక్కెడుతున్నాయి. మరోవైపు గణాంకాల మంత్రిత్వశాఖ  జూన్ త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)  ఈరోజు విడుదల చేయనుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

5వేల రెస్టారెంట్లకు షాక్‌ ఇచ్చిన జొమాటో

ఫేస్‌బుక్‌ అంతర్గత సంభాషణలు, మెమోలు లీక్‌

దిగ్గజాలకు వివో సవాల్‌ : అద్భుత స్మార్ట్‌ఫోన్‌

ట్విటర్‌ కో ఫౌండర్‌ రాజీనామా

అరచేతిలో అన్నీ..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్ ‘మహర్షి’ వాయిదా

బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం

సూపర్‌ స్టార్‌ బాటలో కల్యాణ్‌ రామ్‌

హీరోగా ఎంట్రీ ఇస్తున్న రకుల్ సోదరుడు

రష్మిక కోలీవుడ్‌ ఎంట్రీ ఆ హీరోతోనే..!

యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి