కొనసాగుతున్న రూపాయి బలహీనత

22 May, 2018 00:47 IST|Sakshi

12 పైసలు పతనం

68.12 వద్ద ముగింపు  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి పతనం సోమవారం కూడా కొనసాగింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 12 పైసలు పతనమై, 68.12 పైసలు వద్ద ముగిసింది. గత శుక్రవారం రూపాయి ఒకేరోజు 30 పైసలు పతనమైన సంగతి తెలిసిందే.  ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో గత మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70 స్థాయికి చేరింది.

అయితే వారం చివరకు వచ్చే సరికి శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు పడి 68 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్లకు డిమాండ్, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని. డాలర్‌ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్‌ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ, అధికారులు రూపాయి తీవ్రంగా బలహీనపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దేశం నుంచి భారీ క్యాపిటల్‌ అవుట్‌ఫ్లోస్‌ వల్ల దేశీయ కరెన్సీ పతనం ఆగటం లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు