రూపాయి 38 పైసల నష్టం

13 Aug, 2019 10:39 IST|Sakshi

డాలరు మారకంలో 71 స్థాయికి రూపాయి పతనం

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాల నష్టాలతో  ప్రారంభమైం‍ది. అమెరికన్ కరెన్సీ డాలరు బలం,  దేశీయ ఈక్విటీలలో నష్టాల నేపథ్యంలో మంగళవారం ప్రారంభంలో71.15-71.18 మధ్య బలహీనంగా ట్రేడ్‌ అయింది. డాలర్ మారంకంలో  38 పైసలు క్షీణించి  71  స్థాయికి పడిపోయింది. శుక్రవారం రూపాయి 70.78 వద్ద ముగిసింది. బక్రీద్‌ సందర్భంగా  ఫారెక్స్ మార్కెట్ సోమవారం సెలవు.

ఇతర విదేశీ కరెన్సీలకు వ్యతిరేకంగా యుఎస్ డాలర్ బలానికితోడు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారు (ఎఫ్‌ఐఐ)ల అమ్మకాలు రూపాయి విలువపైప్రభావాన్ని చూపుతున్నట్టు   ఫారెక్స్  ట్రేడర్లు చెప్పారు. అంతేకాకుండా, యుఎస్-చైనా వాణిజ్య చర్చల గురించి ఆందోళనలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంటును  బలహీపర్చినట్టు చెబుతున్నారు.

ఆరు కరెన్సీలతో పోలిస్తేగ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.23 శాతం పెరిగి 97.60 వద్దకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.12 శాతం పడిపోయి బ్యారెల్‌కు 58.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ ట్రేడింగ్ 152 పాయింట్లు తగ్గి 37,429.65 వద్ద, నిఫ్టీ 41.15 పాయింట్లు తగ్గి 11,068.50 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు