మళ్లీ 71కి జారిన రూపాయి....

15 Jan, 2019 04:38 IST|Sakshi

43 పైసలు పతనంతో 70.92 వద్ద ముగింపు

నెలరోజుల కనిష్టం దేశీయ అంశాలు ప్రధాన కారణం

ముంబై: డాలర్‌ మారకంలో  రూపాయి విలువ మళ్లీ పతనబాట పట్టింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం రూపాయి విలువ  ఒకేరోజు 43 పైసలు క్షీణించి 70.92 వద్ద ముగిసింది. గడచిన నెల రోజుల్లో ఈ స్థాయికి రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. డిసెంబర్‌ 17న రూపాయి 71.56 వద్ద ముగిసింది.

కారణాలు చూస్తే...
► శుక్రవారం వెలువడిన నవంబర్‌ పారిశ్రామిక ఉత్ప త్తి గణాంకాలను చూస్తే, కేవలం అరశాతం వృద్ధి నమోదయ్యింది. ఇది 17 నెలల కనిష్ట స్థాయి.
► విదేశీ నిధులు వెనక్కు మళ్లడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం ప్రతికూల ప్రభావం చూపాయి.
► చమురు ధరలు కొంత తగ్గడం, ప్రధాన ప్రపంచ దేశాల కరెన్సీలపై డాలర్‌ బలహీనత వల్ల రూపాయి పతనం కొంత ఆగింది కానీ, లేదంటే మరింత పతనం జరిగేదన్నది విశ్లేషణ.
► అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి  క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తీవ్రతతో జారుడుబల్లపైకి ఎక్కింది.

మరిన్ని వార్తలు