మరో రికార్డు కనిష్టానికి రూపాయి

9 Apr, 2020 11:46 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరో రికార్డు కనిష్టానికి పతనమైంది. గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ప్రారంభంలో 23 పైసల లాభంతో 76.11వద్ద కొనసాగింది. అనంతరం లాభాలన్నీ ఆవిరై పోయి అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 76.55 స్థాయికి పతనమైంది. బుధవారం 76.34 వద్ద ముగిసింది.

డాలర్ సూచీ కీలకమైన గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే 100.17వద్ద ఫ్లాట్‌గా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి దేశీయ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య రూపాయి పతనం కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సెన్సెక్స్ 960 పాయింట్లు పైగా లాభంతో ట్రేడవుతోంది. కాగా భారతదేశంలో ఇప్పటివరకు 5,700 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 15 లక్షలకు పైగా పెరిగింది. 

చదవండి : లాభాల ప్రారంభం : ఫార్మా జోరు  
రుణాలపై వడ్డీరేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ

మరిన్ని వార్తలు