ఉత్సాహం‍గా రూపాయి

13 Feb, 2019 11:27 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ కరెన్సీ రూపాయి హుషారుగా ప్రారంభమైంది.  రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 19 నెలల కనిష్ఠానికి 2.05 శాతానికి చేరిన నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్లో  రూపాయికి జోష్‌ వచ్చింది.  దీంతో డాలరు మారకంలో  రూపాయి వరుసగా ఏడో రోజు లాభాల బాటలో సాగుతోంది.  ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 26 పైసలు (0.3 శాతం) పుంజుకుని 70.44 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం అదే స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు  అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌పై ఆందోళన నేపథ్యంలో  అమెరికా కరెన్సీ డాలరులో అమ్మకాల ధోరణి నెలకొందని దీంతో రూపాయి బలం పుంజుకుందని  కరెన్సీ ట్రేడ్‌ వర్గాలు విశ్లేషించాయి. 

ఇటీవల డాలరుతో మారకంలో బలపడుతూ వస్తున్న దేశీ కరెన్సీ మంగళవారం 48 పైసలు(0.6 శాతం) జంప్‌చేసి 70.70 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. . తద్వారా 71 మార్క్‌ దిగువకు బలపడింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా.. గత ఆరు  సెషన్లలో రూపాయి విలువ 110 పైసలు పెరగడం  విశేషం. మరో దేశీయ స్టాక్‌మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు చెక్‌  చెప్పి డబుల్‌ సెంచరీ లాభాలను సాధించాయి. 

>
మరిన్ని వార్తలు