ఏడు రోజుల తరువాత మళ్లీ బలహీనం 

27 Nov, 2018 00:45 IST|Sakshi

18 పైసలు నష్టపోయిన రూపాయి

70.87 వద్ద ముగింపు  

ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం 18 పైసలు బలహీనపడి 70.87 వద్ద ముగిసింది. గడచిన ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 220 పైసలు బలపడింది. క్రూడ్‌ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 25 డాలర్లు పతనం కావటం, విదేశీ నిధులు రావటం దీనికి కారణాలు. సోమవారం ప్రారంభంలో  పటిష్ట ధోరణితో రూపాయి 70.48 వద్ద ప్రారంభమైంది.

అటు తర్వాత ఎగుమతిదారుల డాలర్లను విక్రయించటంతో రూపాయి విలువ 70.30ను కూడా చూసింది. అయితే ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. అక్టోబర్‌ 9వ తేదీన చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే అటు తర్వాత ఒడిదుడుకులతో కోలుకుంటూ వస్తోంది. నైమెక్స్‌ క్రూడ్‌ బ్యారల్‌ ధర 50 దిగువకు పడిపోతే, రూపాయి మరింత బలపడుతుందన్న అంచనాలున్నాయి. 

మరిన్ని వార్తలు