ఆయిల్‌ ఢమాల్‌ : రుపీ గెయిన్‌

18 Dec, 2018 14:21 IST|Sakshi

14 నెలల కనిష్టానికి బ్రెంట్‌క్రూడ్‌ ధర

62 పైసలు పుంజుకున్న రూపాయి విలువ

70.88 ఎగువకు రూపాయి

సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత బలహీనపడ్డాయి. దీంతో దేశీయ  కరెన్సీ ధర రూపాయి పుంజుకుంది. మంగళవారం డాలరు మారకంలో 37పైసలు ఎగిసింది. అనంతరం మరింత పుంజుకుని  62 పైసలు  లాభంతో 70.88 స్థాయికి ఎగిసింది.   మరోవైపు ప్రధానకరెన్సీలతో డాలర్‌ బలహీనం  దేశీయ కరెన్సీకి సానుకూలంగాఉందని ట్రేడర్లు చెబుతున్నారు. 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్  58.85 డాలర్లకు పడిపోయింది.  1.22 శాతం పతనంతో ఆయిల్‌ధర 14నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. ఒపెక్ దేశాల విధాన పర నిర్ణయాలు, గ్లోబల్ మార్కెట్లలో డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు క్రూడ్ ఆయిల్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి.  అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనా మిడ్‌ సెషన్‌  తరువాత ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో   పరిమిత నష్టాలతో కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు