సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

14 Aug, 2019 09:53 IST|Sakshi

 చైనాపై అమెరికా  సుంకాలు వాయిదా,   ఆసియా కరెన్సీల బలం

రూపాయి 40పైసలు లాభం

సాక్షి, ముంబై : డాలరు మారకంలో దేశీయ కరెన్సీ  బుధవారం  రుపీ  భారీగా ఎగిసింది. మంగళవారం నాటి ముగింపు 71.40 తో పోలిస్తే 40 పాయింట్లు ఎగిసింది.  ఆరంభంలో 55 పాయింట్లు ఎగిసి 70.92 వద్ద ఉన్న రూపాయి  ప్రస్తుతం డాలరు మారకంలో 71 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ముఖ్యంగా  చైనా దిగుమతులపై సుంకాల అమలుపై  అమెరికా వెనక్కి తగ్గడంతో  దేశీయ కరెన్సీకి బలమొచ్చింది.

డిసెంబర్‌ మధ్య కాలం వరకు హాలిడే-షాపింగ్ జాబితాలో ఎక్కువగా ఉండే  కొన్ని చైనా ఉత్పత్తులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు , బొమ్మలు లాంటివాటిపై  10శాతం  సుంకం విధింపునువాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆసియాలో ప్రధాన కరెన్సీలు లాభపడుతున్నాయి.  మరోవైపు  దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా 150 పాయింట్లకు పైగా  ఎగిసి పాజిటివ్‌గా ఉన్నాయి. అలాగే  అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌  ధర కూడా లాభపడింది.

మరిన్ని వార్తలు