మూడు వారాల గరిష్టం : అయినా అనుమానమే

29 Apr, 2020 16:28 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ బుధవారం లాభాలతో ముగిసింది. డాలరు మారకంలో 3 వారాల గరిష్ట స్థాయిని తాకింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో  సానుకూల సంకేతాల, డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం నాటి  ముగింపు 76.19 తో పోలిస్తే రూపాయి 76 స్థాయికి ఎగువకు చేరింది. ఆరంభంలోనే 35 పైసలు ఎగిసింది.  చివరికి 52 పైసల లాభంతో 75.67 వద్ద ముగిసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్ ఒప్పందానికి సంబంధించిన డాలర్ల ప్రవాహం భారత కరెన్సీ లాభాలకు దోహదపడిందని ఎమ్కే గ్లోబల్ పరిశోధకుడు హెడ్ రాహుల్ గుప్తా  అన్నారు.

అయితే రూపాయిలో బలం నిలబడదని , రాబోయే సెషన్లలో  మళ్లీ 77 వైపునకు బౌన్స్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్  భయాలతో బలహీనత కొనసాగుతుందని తెలిపారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని రెలిగేర్ బ్రోకింగ్ సంస్థకు చెందిన సుగంధ సచ్‌దేవా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సంక్షోభంతో రూపాయి పతనమైందనీ, ఈ నష్టాల నుంచి కొంత విరామం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రూపాయి పాజిటివ్ ధోరణి నిలబడుతుందా లేదా అనేది అంచనా వేయాల్సి వుందనీ, దేశీయ కరెన్సీ 75.20 - 76.60   మధ్య కదలాడుతోందని  సచ్‌దేవా తెలిపారు  అటు దేశీయ స్టాక్ మార్కెట్లు  భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 606 పాయింట్లు ఎగిసి 32720వద్ద, నిఫ్టీ 172పాయింట్లు లాభపడి 9553 వద్ద  స్థిరంగా ముగిసాయి.  (మూడో రోజూ లాభాలు: ఏడు వారాల గరిష్టం)

చదవండి :  ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!
రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్

>
మరిన్ని వార్తలు