రూపాయి జోరు : 37 పైసలు జంప్

23 Jun, 2020 15:31 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో  రోజు కూడా స్థిరంగా  ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ర్యాలీకి తోడు డాలరు బలహీనత నేపథ్యంలో మంగళవారం డాలరు మారకంలో రూపాయి  పాజిటివ్ గా ట్రేడింగ్ ను ఆరంభించింది.  చివరకు  37 పైసల  లాభంతో 75.66 వద్ద  ముగిసింది.  (ఐటీ షేర్లకు ట్రంప్ షాక్ : రికవరీ)

ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి 75.86 వద్ద బలంగా ప్రారంభమైంది. రోజులో 75.65 గరిష్ట స్థాయికి, 75.89 వద్ద కనిష్టానికి చేరుకుంది. నిన్న (సోమవారం) 76.02 వద్ద ముగిసింది. ఆరు కరెన్సీల గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.13 శాతం తగ్గి 96.91 వద్దకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ 0.67 శాతం పెరిగి 43.37 డాలర్లకు చేరుకుంది. అటు సెన్సెక్స్ 550 పాయింట్లు పైగా ఎగియగా,  నిప్టీ 10460  ఎగువన స్థిరంగా ట్రేడ్ అవుతోంది. 

>
మరిన్ని వార్తలు