వారెవ్వా..రుపీ..అయిదేళ్లలో ఇదే బెస్ట్‌

18 Dec, 2018 19:44 IST|Sakshi

డాలరు మారకంలో 112పైసలు ఎగిసిన రూపాయి

సెప్టెంబరు 19, 2013న 161పైసలు లాభం

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి దూసుకుపోయింది. డాలరు మారకంలో సోమవారం నాటి   ముగింపు 71.56 తో పోలిస్తే నేడు భారీగా లాభపడింది. ఆరంభంనుంచి జోష్‌గా ఉన్న  రూపాయి సోమవారం 34పైసలు పుంజుకున్న రూపాయి వరుసగా రెండో రోజు మరింత జోరుగా సాగింది. మంగళవారం 112 పైసలు ఎగిసి 70.44 వద్ద  ముగిసింది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, భారత కరెంట్ అకౌంట్ లోటు  విస్తరణ నేపథ్యంలో  రూపాయి బలపడిందని ట్రేడర్లు భావిస్తున్నారు.  అయిదేళ్ల తరువాత రూపాయి ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారని  పేర్కొన్నారు. సెప్టెంబరు 19, 2013న  డాలరు మారకంలో 161 పైసలు  లాభపడింది.

అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర  2.26 శాతం క్షీణించి 58.26 డాలర్ల వద్ద 14 నెలల కనిష్టాన్ని తాకింది. అటు ఇతర విదేశీ కరెన్సీలతో డాలర్‌ బలపడింది.  మార్కెట్లో లిక్విడిటీ ఆందోళలు తగ్గడం, ఈక్విటీ మార్కెట్‌లో బుల్లిష్ ధోరణి కూడా రూపాయికి మద్దతు ఇచ్చిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. వెరసి భారతీయ కరెన్సీ కళకళలాడింది.  మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఆరవరోజు కూడా లాభాల్లో ముగిసిన సంగతి  తెలిసిందే.
 

మరిన్ని వార్తలు