ఏడో రోజూ బలహీనమే

6 Sep, 2018 09:58 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ  రూపాయి పతనం కొనసాగుతోంది.  నిన్నటి ముగింపుతో పోల్చుకుంటే నేడు  (గురువారం) డాలరుమారకంలో  9 పైసలు ​ కోలుకుని 71.66 వద్ద ట్రేడింగ్‌ ఆరం భించింది. కానీ అంతలోనే వరుసగా ఏడో రోజుకూడా బలహీనపడింది.  రోజుకో ఆల్‌టైం కనిష్టాన్ని చూస్తున్న రూపాయి తాజాగా 72స్థాయికి చాలా దగ్గరగా ఉంది.   ప్రస్తుతం 34పైసలు దిగజారి 71.92 వద్ద కొనసాగుతోంది.   
మరోవైపు రూపాయి వరుస పతనంపై ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం అంతర్జాతీయ కారణాల కారణంగా రూపాయి విలువ క్షీణిస్తోందని, ఇతర కరెన్సీలతో పోలిస్తే దేశీయ యూనిట్ బాగానే ఉందని అన్నారు.
కాగా బుధవారం  71.75 వద్దరికార్డు ముగింపును నమోదు చేసింది.  ఇంట్రా డే లో చారిత్రాత్మక కనిష్టం 71.97ని టచ్‌ చేసింది.

మరిన్ని వార్తలు