నష్టాల్లో ప్రారంభమైన రూపాయి

21 Jun, 2019 09:20 IST|Sakshi

సాక్షి, ముంబై:  డాలరుమారకంలో రుపీ   బలహీనంగా  ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  31 పైసలు క్షీణించి 69.75 వద్ద కొనసాగుతోంది.  దేశీయ ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ నేపథ్యంలో జూన్ 20న  రూపాయి 24 పైసలుఎగిసి  అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ. 69.44 వద్ద ముగిసింది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు