మరోసారి బలహీనపడిన రూపాయి

4 May, 2020 12:31 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి మళ్లీ బలహీనపడింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్ళీ బలపడటంతో 4 రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.71 వద్ద ప్రారంభమైంది. తద్వారా 4 రోజులుగా లాభాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం 72 పైసలు బలహీనపడి 75.80 వద్ద రూపాయి ట్రేడవుతోంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో (గురువారం) రూపాయి 75.09 వద్ద స్థిరపడింది.  డాలర్ ఇండెక్స్ 0.31శాతం పెరిగి 99.38 కు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ కు 0.95 శాతం క్షీణించి 26.19 డాలర్లకు చేరుకుంది. (జియో మరో భారీ డీల్ )

దేశీయ ఈక్విటీలలో భారీ అమ్మకాలకు తోడు, దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు  రూపాయి అమ్మకాలకు దారి తీస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు దేశీయ  స్టాక్ మార్కెట్లు 1700 పాయింట్ల భారీ పతనాన్ని నమోదు చేశాయి. దీంతో సెన్సెక్స్ 32 వేలకు దిగువకు చేరింది. నిఫ్టీ 479 పాయింట్లు కుప్పకూలింది. ప్రధానంగా ఆటో,  మెటల్,  బ్యాంకింగ్ షేర్లు నష్టపోతున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు మళ్లీ 20 వేల స్థాయి దిగువన ట్రేడ్ అవుతోంది. ఫార్మ రంగం ఒక్కటే స్వల్పంగా లాభపడుతోంది.  మరోవైపు బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి.  భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1300 కు పెరిగింది.  సోమవారం నాటికి  కరోనా వైరస్  పాజిటివ్ కేసుల సంఖ్య 42,500 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 35 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 2.47 లక్షలకు చేరుకుంది. మరోవైపు  మరో రెండు వారాలపాటు దేశవ్యాప్త  లాక్‌డౌన్‌ కొనసాగనుంది. (మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు)

చదవండి :  రూపాయి రయ్..రయ్...

మరిన్ని వార్తలు