16 పైసలు ఎగిసిన రూపాయి

15 Jul, 2019 10:23 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ  రూపాయి సానుకూలంగా ఆరంభాన్నిచ్చింది.  అమెరికా  డాలరుతో  పోలిస్తే  రూపాయి  సోమవారం విలువ 16 పైసలు పెరిగి 68.53  స్థాయికి చేరుకుంది.  ఈక్విటీ మార్కెట్ల లాభాలు,ముడి చమురు ధరలు తగ్గడంతో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 68.59 వద్ద బలంగా ప్రారంభమైంది.  శుక్రవారం  68.69 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గ్లోబల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి బ్యారెల్కు 66.64 వద్ద 0.12 శాతం క్షీణించింది. 

అటు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన ఈక్విటి మార్కెట్లు  లాభాల నుంకి వెనక్కి తగ్గాయి. 240 పాయింట్లకు పైగా ఎగిసిన  సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభాలకు పరిమతంగా కాగా, ఆరంభంలో 11600  స్థాయికి ఎగువర స్తిరంగా ప్రారంభమైన  నిఫ్టీ  ఆ స్థాయిని కోల్పోయింది. 

>
మరిన్ని వార్తలు