18 పైసలు బలపడిన రూపాయి

15 Nov, 2019 11:00 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 18 పైసలు బలపడి 71.79 వద్ద ప్రారంభమైంది. రూపాయి 71.80 వద్ద ప్రారంభమైంది, తరువాత మరింత పుంజుకుని,  71.78 వద్ద  ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది, గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 72 స్థాయి దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే.  గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.43 శాతం పెరిగి బ్యారెల్కు 62.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్ల  జోరు రూపాయికి బలాన్నిచ్చినట్టు ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. వచ్చే నెల జరగనున్న ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను కొనసాగించనున్నారనే అంచనాలుండడంతో చమురు ధరలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. 
 

>
మరిన్ని వార్తలు