33 పైసలు ఎగిసిన రూపాయి.. మళ్లీ

3 Mar, 2020 10:34 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ రూపాయికూడా మంగళవారం భారీగా పుంజుకుంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే రూపాయి 72.50 వద్ద ప్రారంభ మైంది. అనంతరం 33 పైసలు పెరిగి 72.43 కు చేరుకుంది.  కానీ ఈ లాభాలను నిలబెట్టుకోలేకపోయిన  రూపాయి 72.64 వద్ద కొనసాగుతోంది. సోమవారం రూపాయి 72.76  ఏడాది కనిష్టం వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ ముడి చమురు ఫ్యూచర్స్ 2.41 శాతం పెరిగి బ్యారెల్కు 53.15 డాలర్లకు చేరుకుంది. అయితే బంగారం ధరలు  ఫ్యూచర్స్‌ లో స్వలంగా తగ్గా, వెండి ధరలు పుంజుకున్నాయి.

అటు  దలాల్‌  స్ట్రీట్‌లో, ఇటు కరెన్సీ మార్కెట్లో కూడా కరోనావైరస్‌ ఆందోళన కొనసాగుతోంది. దీంతోపాటు ఢిల్లీలో ఒకటి,  తెలంగాణా ఒక పాజిటివ్‌ కేసు నమోదుకావడంతో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు  నేడు సానుకూలంగా కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్456పాయింట్లు పెరిగి 38,603  వద్ద, నిఫ్టీ 1590 పాయింట్లు పెరిగి 11,292 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.  విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ. 1,354.72 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. కాగా చైనాలో విస్తరించిన కోవిడ్‌-19 క్రమంగా ప్రపంచదేశాలను చుట్టముడుతోంది. తాజాగా భారతదేశంలో మరో రెండు కరోనా వైరస్‌ బాధితులను గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  సోమవారం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు