భారీగా కోలుకున్న రూపాయి

6 Aug, 2019 14:44 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి కోలుకుంది. ఇటీవలి నష్టాల నుంచి భారీగా పుంజుకున్న రూపాయి మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే సానుకూల సంకేతాలిచ్చింది. డాలరు మారకంలో 25 పాయింట్లు లాభపడి అయిదు నెలల కనిష్టంనుంచి  కోలుకుంది.  సోమవారం నాటి ముగింపు 70.60 తో పోలిస్తే 70.47 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. అనంతరం నష్టాల్లోకి జారుకున్న రుపీ ప్రస్తుతం 70.73వద్ద ఫ్లాట్‌గా కొనసాగుతోంది.  గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా  సోమవారం ఏకంగా 113 పైసలు నష్టపోయిన సంగతి తెలిసిందే. 

ఈక్విటీ మారెట్లు కూడా భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపైగా   పుంజుకోగా, నిఫ్టీ 140 పాయింట్లు ఎగిసింది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతుస్థాయిలకు పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు