14 పైసలు ఎగిసిన రూపాయి

29 May, 2020 14:40 IST|Sakshi

లాభనష్టాలతో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌

32వేల ఎగువన సెన్సెక్స్‌

9500 ఎగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌గా ముగిసింది. గురువారం నాటి నష్టాలతో పోలిస్తే  నేడు (శుక్రవారం)  డాలరు మారకంలో 14 పైసలు ఎగిసి 75.62 వద్ద ముగిసింది.  ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 75.71 వద్ద ప్రారంభమై అనంతరం పుంజుకుంది.

విదేశీ నిధుల ప్రవాహం, అమెరికా కరెన్సీ డాలరు బలహీనత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిందని ఎనలిస్టులు చెప్పారు.  జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి  గణాంకాల కోసం ఫారెక్స్ వ్యాపారులు, పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకున్నాయి. ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు మిడ్‌ సెషన్‌ నుంచి క్రమంగా పుంజుకున్నా లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయినప్పటికీ సెన్సెక్స్ 32200 స్థాయికి ఎగువన, నిఫ్టీ 95 వందల పాయింట్ల ఎగువకు చేరడం విశేషం.  

మరిన్ని వార్తలు