మోదీ బూస్ట్‌ : ఎగిసిన రూపాయి

2 Jun, 2020 15:32 IST|Sakshi

18 పైసలు లాభపడి రూపాయి

33800 ఎగువకు సెన్సెక్స్‌

మళ్లీ 10వేలకు చేరువలో  నిఫ్టీ

సాక్షి, ముంబై : కరోనా సంక్షోభంనుంచి దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశీయ కరెన్సీ  భారీగా లాభపడింది. మంగళవారం డాలరు మారకంలో రూపాయి 75.57 వద్ద ప్రారంభమై అనంతరం పుంజుకుంది. చివరకు 18 పైసలు లాభపడి  75.36 వద్ద ముగిసింది. అంతకుముందు 75.54 వద్ద ‍ స్థిరపడింది.

ముడి చమురు బ్రెంట్‌ ఫ్యూచర్స్ 2.14 శాతం పెరిగి బ్యారెల్‌కు 39.14 డాలర్లకు చేరుకుంది.  ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.27 శాతం తగ్గి 97.57 వద్దకు చేరుకుంది. సానుకూల దేశీయ ఈక్విటీలు, బలహీనమైన అమెరికన్ డాలర్,  విదేశీ నిధుల ప్రవాహం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా వుందని  ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.

మరోవైపు వరుసగా ఐదవ సెషన్‌లో కూడా లాభపడుతున్న దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా ఆరంభ లాభాల తో పోలిస్తే ప్రధానిమోదీ ప్రకటన తరువాత బాగా పుంజుకున్నాయి.  సెన్సెక్స్‌  ప్రస్తుతం 557 పాయింట్లు  లాభంతో 33861వద్ద,  నిఫ్టీ 169 పాయింట్లు  ఎగిసి 9994 వద్ద పటిష‍్టంగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు