రూపాయి అనూహ్య పతనం

18 May, 2017 23:44 IST|Sakshi
రూపాయి అనూహ్య పతనం

ఒకే రోజు 69 పైసలు డౌన్‌
64.84 వద్ద ముగింపు
ఒకే రోజు ఇంత స్థాయిలో పతనం
2016 జూలై 26 తర్వాత తొలిసారి
అంతర్జాతీయ అనిశ్చితే కారణం  


ముంబై: డాలర్‌ మారకంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్‌ రూపాయికి ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. ఫారెక్స్‌ మార్కెట్‌లో గురువారం ఒకేరోజు 69 పైసలు (1.06 శాతం) బలహీనపడి  64.84 వద్ద ముగిసింది. 2017 ఏప్రిల్‌ 5 తరువాత రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఒక దశలో రూపాయి 64.91 స్థాయికి సైతం పతనం అయ్యింది.  అమెరికా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రూపాయి ఒకే రోజు ఇంత దారుణ పతనం 10 నెలల్లో ఇదే తొలిసారి. 2016 జూలై 26న ఇలాంటి పతనం జరిగింది.

డాలర్‌కు డిమాండ్‌...
గత మూడు రోజులగా రూపాయి మారకం విలువ బలపడుతూ వస్తోంది.  దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరపడం కూడా రూపాయి అనూహ్య పతనానికి దారితీసింది. అమెరికా పరిణామాలు ఇటు ఫారెక్స్‌తో పాటు భారత్‌ స్టాక్‌ మార్కెట్‌పై సైతం ప్రభావం చూపింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతిదారుల నుంచి డాలర్ల కోసం భారీ డిమాండ్‌ ఏర్పడింది. నిజానికి డాలర్‌ బలహీనపడుతుంటే, రూపాయి బలపడాల్సి ఉంటుంది. అయితే అమెరికా రాజకీయ పరిస్థితులు, తద్వారా ఆర్థిక సంక్షోభ భయాలు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.

 ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌పై అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అవకాశాలపై విచారణకు ప్రత్యేక కౌన్సిల్‌ వంటి అంశాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తద్వారా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్‌ ఆర్థిక అనిశ్చితి మరింత పెరుగుతుందన్న భయాలు మార్కెట్లపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్‌ డీలర్‌ ఒకరు తెలిపారు. కాగా కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌  ఇండెక్స్‌ 97.60 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి 64.88 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!