30 పైసలు క్షీణించిన రూపాయి

24 Feb, 2020 10:27 IST|Sakshi

సాక్షి, ముంబై:  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) ఆందోళనలు దేశీయ కరెన్సీరూపాయిని వెంటాడుతున్నాయి. సోమవారం నాటికి  ప్రారంభ ట్రేడింగ్‌లో డాలరు మారకంలో రూపాయి ఏకంగా 30పైసలు క్షీణించింది. ముడి చమురు ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్ల అమ్మకాలతో రూపాయి 71.94కు చేరింది. శుక్రవారం  రూపాయి 71.64 వద్ద స్థిరపడింది. ముడి చమురు ఫ్యూచర్స్ 2.51 శాతం పడిపోయి బ్యారెల్‌కు 57.03 డాలర్లకు చేరుకుంది. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు మందగించి డిమాండ్‌ తగ్గవచ్చన్న అంచనాలతో ముడిచమురు ధరలు దాదాపు 3 శాతం పతనమయ్యాయి. అటు  దేశీయస్టాక్‌మార్కెట్లు కూడా సోమవారం సుమారు 500 పాయింట్లు పతనమైనాయి. అటు దేశీయంగా పసిడి 24 క్యారెట్ల పది గ్రాములు ధర రూ.43165 వద్ద  ఆల్‌టైం గరిష్టానికి చేరింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔస్స్‌(31.1 గ్రాములు) బంగారం ధర 1.2 శాతం పుంజుకుని 1669 డాలర్లకు చేరింది.పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి  6.34 శాతంగా ఉంది. మరోవైపు చైనాలో కోవిడ్‌-19 వైరస్‌తో  మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి  2,592 కు చేరింది.

మరిన్ని వార్తలు