54పైసలు నష్టపోయిన రూపాయి

12 Nov, 2018 15:01 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి  భారీ పతనాన్ని నమోదు చేసింది.  సోమవారం ఉదయం  ఆరంభంనుంచి డాలరు మారకంలో  బలహీనంగా రూపాయి  మరింత క్షీణించింది.  ఏకంగా 54 పైసలు కోల్పోయి 73.04 స్థాయికి దిగజారింది.  29 పైసలు(0.4 శాతం) నీరసించింది. సౌదీ అరేబియా ప్రకటించిన చమురు కోత   ప్రకటనతో క్రూడ్‌ ధరలు 1.5 శాతం ఎగిశాయి.  అటు  డాలరు కూడా 16నెలల  గరిష్టాన్ని  తాకింది. దీంతో  రూపాయిలో అమ్మకాలు ఒత్తిడి నెలకొందని ట్రేడ్‌వర్గాలు  చెప్పాయి.

మరోవైపు  ఉత్సాహంగా ప్రారంభమైన  స్టాక్‌మార్కెట్లలో కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీగా నెలకొన్నాయి.  260కిపైగా పాయింట్లను నష్టపోయిన సెన్సెక్స్‌ 35వేల మార్క్‌ దిగువకు చేరింది. 

మరిన్ని వార్తలు