రూపాయి 43 పైసలు డౌన్‌

2 Oct, 2018 00:39 IST|Sakshi

43 పైసల నష్టంతో 72.91 వద్ద క్లోజ్‌

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం సోమవారం 43 పైసలు నష్టపోయింది. అమెరికా ట్రెజరీ రాబడులు 3 శాతానికి పైగా మించడంతో డాలర్‌ బలపడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోల్చితే డాలర్‌ నెల గరిష్టానికి చేరింది.

శుక్రవారం ముగింపు 72.48తో పోలిస్తే...  43 పైసల నష్టంతో 72.91 వద్ద ముగిసింది. ఈ నెలలో ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా రూ.36,000 కోట్ల మేర నిధులు అందించగలమని ఆర్‌బీఐ ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటన రూపాయి పతనాన్ని అడ్డుకోలేకపోయింది. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రూపాయి పతనం కొనసాగుతోం దని నిపుణులు పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గకపోతే, రూపాయి పతనం మరింతగా కొనసాగుతుందనేది వారి అభిప్రాయం.

మరిన్ని వార్తలు