మరో 34పైసలు నష‍్టపోయిన రుపీ

23 Apr, 2018 16:15 IST|Sakshi


సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ  మరింత బలహీనపడింది.  ఇటీవల నష్టాలను మరింత పెంచుకున్న రూపాయి కరెన్సీ మార్కెట్‌లో రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోకూడా బలహీనపడింది.  డాలర్‌ మారకంలో సోమవారం కూడా నెగిటివ్‌గానే ముగిసింది.  ఆరంభంలో 8పైసల నష్టంతో  ట్రేడ్‌అయిన రూపాయి  ఇన్వెస్టర్ల అమ్మకాలతోమరింత నష్టపోయింది.  డాలర్‌ మారకంలో  దాదాపు 34పైసలు (0.5శాతం) పతనమై 66.46వద్దకు చేరింది.నింగిని తాకుతున్న  చమురు ధరలు   రుపీ ట్రెండ్‌ను  బలహీన పర్చాయని ట్రేడర్లు చెప్పారు.  అలాగే  రిజర్వ్‌  బ్య ాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలు కరెన్సీలో అమ్మకాలకుదారితీసింది.  అటు డాలర్‌ పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు , బ్యాంకర్ల కొనుగోలవైపు మొగ్గు చూపారు. దీంతో  మార్చి 2017నాటి కనిష్టానికి చేరింది.
 

మరిన్ని వార్తలు