రూపాయి... రెండు వారాల గరిష్టం @ 71.50

27 Nov, 2019 02:09 IST|Sakshi

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్‌ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి.  దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49–71.68 శ్రేణిలో తిరిగింది.

గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో  రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు బలపడింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ ముందుకు వెళ్లలేకపోయింది.  చమురు ధర పెరుగుదల భయాలు  కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!

నేడే మెగా విలీనం

రిలీఫ్‌ ర్యాలీ..!

మీ ఈఎంఐ కట్‌ చేయొద్దా?

హానర్‌ కొత్త ఫోన్‌ ‘30ఎస్‌’

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది