రూపాయి రయ్..రయ్...

30 Apr, 2020 12:16 IST|Sakshi

భారీగా లాభపడుతున్న రూపాయి

విదేశీ పెట్టుబడుల ప్రవాహం

లాక్‌డౌన్ ఆంక్షల సండలింపు ఆశలు

63 పైసలు పెరిగి 75.03 వద్దకు

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి గురువారం వరుసగా నాలుగో రోజు కూడా భారీగా పుంజుకుంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 63 పైసలు పెరిగి 75.03కు చేరుకుంది. బుధవారం నాటి ముగింపుతో ముగింపుతో పోలిస్తే 75.17 వద్ద కొనసాగుతోంది. దేశీయ ఈక్విటీ మర్కెట్ల లాభాలు, విదేశీఫండ్ల ప్రవాహంలాంటివి సానుకూలంగా పనిచేస్తున్నామని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. వరుసగా మూడు రోజుల లాభాలతో  మూడువారాల గరిష్టానికి చేరిన రూపాయి బుధవారం  75.66 వద్ద స్థిరపడింది. 

మార్కెట్ గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం 722.08 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అంతేకాదు  మే 4 నుండి భారతదేశం అనేక రంగాలలో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ తిరిగి ప్రారంభం కానుందనే ఆశ పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ను బల పరుస్తోందని  మార్కెట్ వర్గాలు  తెలిపాయి. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు)

ప్రధానంగా  కరోనా వైరస్ బాధితుల్లో గిలియడ్ కు చెందిన యాంటి వైరల్ డ్రగ్ రెమెడిసివిర్‌ సానుకూల ఫలితాలనిస్తోందన్న వార్త బలాన్నిస్తోందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. డాలర్ ఇండెక్స్ 0.02 శాతం పెరిగి 99.58 వద్ద ట్రేడవుతోంది. డాలర్ ఇండెక్స్ 0.02 శాతం పెరిగి 99.58 వద్ద ట్రేడవుతోంది. దేశీయ  కీలక  సూచీ సెన్సెక్స్ 1072 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 300 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. గత మూడు సెషన్లుగా సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా ఎగియడం విశేషం. (కోవిడ్-19 కు మందు : లాభాల హై జంప్)

కాగా భారతదేశంలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 1074 కు పెరిగింది కేసుల సంఖ్య గురువారం 33,050 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 31.93 లక్షలు దాటింది.  మరణించిన వారి సంఖ్య 2.27 లక్షలకు చేరుకుంది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు