భారీగా బలపడిన రూపాయి

2 Aug, 2017 13:19 IST|Sakshi
భారీగా బలపడిన రూపాయి
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా పాలసీ ప్రకటనకు ముందుకు రూపాయి భారీగా బలపడింది. ఏకంగా రెండేళ్ల గరిష్టంలోకి ఎగిసింది. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ రెండేళ్ల గరిష్టంలో 63.82 వద్ద ట్రేడైంది. రూపాయి బలపడటానికి ప్రధాన కారణం.. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ)లు భారీగా నగదును దేశీయ ఈక్విటీ, డెట్‌ మార్కెట్‌లలోకి మరలించడమేనని విశ్లేషకులు చెప్పారు.  ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.12గా నమోదైంది. అనంతరం 2015 ఆగస్టు 10 నాటి స్థాయి 63.82 వద్ద గరిష్ట స్థాయిలను నమోదుచేసింది.
 
ప్రస్తుతం 23 పైసలు బలపడి 63.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 6.12 శాతం మేర లాభపడింది. మరోవైపు ఆర్బీఐ పాలసీ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 57.38 పాయింట్ల నష్టంలో 32,517 వద్ద, నిఫ్టీ 25.50 పాయింట్ల నష్టంలో 10,089 వద్ద కొనసాగుతున్నాయి. ఈసారైనా ఆర్బీఐ రేట్ల కోతను చేపడుతుందా? లేదా? అని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   
 
మరిన్ని వార్తలు