మూడు నెలల కనిష్ట విలువకు రూపాయి

1 Mar, 2018 01:04 IST|Sakshi

డాలర్‌తో  30 పైసలు కోల్పోయి 65.17కు చేరిక 

వరుసగా మూడో రోజు నష్టాలు

ముంబై: డాలర్‌తో రూపాయి వెలవెలబోయింది. ఒకే రోజు బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో 30 పైసలు పడిపోయి 65.17కు చేరింది. రూపాయికి ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జీరోమ్‌పావెల్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో బలంగా ఉంటుందని, ఈ ఏడాది కూడా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందంటూ చేసిన ప్రకటనతో డాలర్‌ బలం పుంజుకుంది.

ఇంట్రాడేలో రూపాయి 65.32 వరకూ తగ్గింది. ఆ తర్వాత తిరిగి కాస్త కోలుకుని నికరంగా 30 పైసలు నష్టం (0.46 శాతం)తో 65.17 వద్ద క్లోజయింది.  

మరిన్ని వార్తలు