75 స్థాయి దిగువకు రూపాయి

3 Jul, 2020 11:55 IST|Sakshi

రెండోరోజూ అదే జోరు

నేడు 44పైసలు బలపడిన రూపీ

డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 75స్థాయి దిగువకు చేరుకుంది. నేడు ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 43పైసలు బలపడి 75స్థాయి దిగువున 74.58 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆర్‌బీఐ బ్యాంక్ డాలర్ కొనుగోళ్లను క్రమంగా తగ్గించుకోవచ్చనే అంచనాలతో పాటు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ తగ్గుదల  తదితర అంశాలు రూపాయి బలపడేందుకు కారణమైనట్లు ఫారిన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి ఉదయం గంటలకు 11:30ని.లకు డాలర్‌ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(75.01)తో పోలిస్తే 32పైసలు బలపడి 74.69 వద్ద ట్రేడ్‌ అవుతోంది. రానున్న రోజుల్లో రూపాయి అధిక స్థాయిలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు లోనయ్యే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ అంచనా వేస్తుంది. నేడు 74.70-74.50 పరిధిని పరీక్షించే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ తెలిపింది. (3 నెలల గరిష్టానికి రూపాయి)

ఒక్కరోజే 50పైసలు బలపడిన రూపాయి
నిన్న ఒక్కరోజే రూపాయి విలువ 50పైసల మేర బలపడింది. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై ఆశలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల లాభాల ముగింపు, ఆయా దేశాల కరెన్సీలు బలపడటంతో ఆరు కరెన్సీ విలువల్లో డాలర్‌ విలువ క్షీణించడం తదితర కారణాలతో నిన్నరోజు రూపాయి విలువ 50 పైసలు బలపడి 75.01 స్థాయి వదర్ద స్థిరపడింది. తద్వారా ఏప్రిల్‌ 23 తదుపరి ఒకే రోజులో అత్యధిక లాభాల్ని ఆర్జించగలిగింది.

మరిన్ని వార్తలు