మరింత బలహీనపడిన రూపాయి

13 Apr, 2020 12:01 IST|Sakshi


సాక్షి,ముంబై : డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ  అంతకంతకూ క్షీణిస్తోంది. సోమవారం 76.29 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపాయి మరో 5 పైసలు బలహీనపడి 76.34 స్థాయికి పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనత నేపథ్యంలో  ఇంట్రాడేలో 76.43 స్థాయిని తాకింది. గత గురువారం  76.54  వద్ద రికార్డు కనిష్టానికి  పడిపోయిన రూపాయి చివరకు 76.28 వద్ద  ముగిసింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏప్రిల్ 10 శుక్రవారం కరెన్సీ మార్కెట్ పనిచేయలేదు.  

కోవిడ్-19 వ్యాప్తి, వైరస్ మరణాల ఆందోళన, ప్రపంచ ఆర్థిక మాంద్యంపై పెరుగుతున్న ఆందోళనలతో రూపాయి బలహీనపడుతోందని ఎనలిస్టులు చెబుతున్నారు. బలహీనత కొనసాగవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫారసు చేస్తోంది. డాలరు బలం ఆయిల్ ధరలు కనిష్టంనుంచి పుంజుకోవడంతో మరింత ఒత్తడి కనిపించడనుందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ కరెన్సీ హెడ్ రాహుల్ గుప్తా అన్నారు. మరోవైపు తీవ్ర ఒడిదుడుకులతో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం పుంజుకున్నాయి. 600 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 71 పాయింట్ల నష్టాలకుపరిమితం కాగా, నిఫ్టీ 13  పాయింట్ల స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది.  తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువకు  చేరడం విశేషం. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు)

మరిన్ని వార్తలు