‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌

29 Aug, 2019 10:56 IST|Sakshi

వాయిదా పద్ధతిలో కొనుగోలుకు అవకాశం

నెలకు రూ. 3,499

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌.. తన తొలి ఈ–మోటార్‌సైకిల్‌ ‘ఆర్‌వీ 400’ను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నెలవారీ సులభ వాయిదా పద్ధతిలో ఈ బైక్‌ను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తూ.. స్పెషల్‌ పేమెంట్‌ స్కీంను ప్రకటించింది. నెలకు రూ. 3,499 చొప్పున 37 నెలలు చెల్లించే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ఈ బైక్‌ ప్రీ–బుకింగ్స్‌ జూన్‌ 25 నుంచి ప్రారంభం కాగా, తొలుత ఢిల్లీలో వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

అపరిమిత బ్యాటరీ వారంటీ.. ఉచిత నిర్వహణ ప్రయోజనం, ఉత్పత్తి వారంటీ, బీమా అందిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్‌ శర్మ వివరించారు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 150 కి.మీ ప్రయాణిస్తుందని, బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పారాయన. గరిష్టవేగం 85 కిలోమీటర్లుగా ఉండనుందన్నారు. ఇక మరోబైక్‌ ‘ఆర్‌వీ 300’ను కంపెనీ ఆవిష్కరించింది. నెలకు రూ. 2,999 వాయిదాతో ఈ బైక్‌ను అందించనున్నట్లు మైక్రోమాక్స్‌ సహ–వ్యవస్థాపకుడిగా సేవలందించి, ప్రస్తుతం రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ ఫౌండర్‌గా కొనసాగుతోన్న శర్మ వివరించారు. 

మరిన్ని వార్తలు