ఎకానమీకి కరోనా షాక్‌..

18 Mar, 2020 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 5.2 శాతానికే పరిమితమవుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. కోవిడ్‌-19 వ్యాప్తితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతోందని పేర్కొంది. 2020 కేలండర్‌ సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు 5.7 శాతంగా ఉంటుందని గతంలో ఎస్‌అండ్‌పీ అంచనా వేయగా కరోనా మహమ్మారి ప్రభావంతో వృద్ధి రేటు అంచనాను తాజాగా 5.2 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుండటంతో ఆసియా పసిఫిక్‌ వృద్ధిరేటు 2020లో మూడు శాతానికే పరిమితమవుతుందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది.

కరోనా కేంద్రమైన చైనా అతలాకుతలం కావడం, అమెరికా, యూరప్‌లలో షట్‌డౌన్‌లు, స్ధానికంగా వైరస్‌ వ్యాప్తి వంటి అంశాలతో ఆసియా పసిఫిక్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకుంటోందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఆసియా పసిఫిక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ షౌన్‌ రోచే స్పష్టం చేశారు. 2020లో చైనా, భారత్‌, జపాన్‌ వృద్ధిరేట్లను తాము వరుసగా 2.9, 5.2, -1.2 శాతానికి తగ్గించామని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ఇక మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సైతం 2020లో భారత వృద్ధి రేటును 5.4 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గించింది.

చదవండి : సైన్యంలో తొలి కరోనా కేసు

మరిన్ని వార్తలు