ఓలాలో సచిన్‌ బన్సల్‌ పెట్టుబడులు 

20 Feb, 2019 02:26 IST|Sakshi

రూ. 650 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసిన బన్సల్‌ 

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సల్, ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఓలాలో రూ.650 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నిధుల దన్నుతో మరో ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌కు ఓలా మరింత గట్టిపోటీని ఇస్తుందని అంచనా. కాగా సచిన్‌ బన్సల్‌  వ్యక్తిగతంగా ఈ పెట్టుబడులు పెట్టారని ఓలా పేర్కొంది. ఓలాలో  వ్యక్తిగత పెట్టుబడులు అత్యధికంగా పెట్టిందని సచిన్‌ బన్సలేనని ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.  సచిన్‌ బన్సల్‌ తమ కంపెనీలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఎంటర్‌ప్రెన్యూర్షిప్‌కు సచిన్‌ ఒక నమూనా అని ప్రశంసించారు.  సిరీస్‌ జే రౌండ్‌ నిధుల సమీకరణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఓలా కంపెనీ సచిన్‌ బన్సల్‌కు రూ.150 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది.  పదేళ్ల క్రితం బిన్నీ బన్సల్‌తో కలిసి సచిన్‌ బన్సల్‌ ఫ్లిప్‌కార్ట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ 1,600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. 

మరిన్ని వార్తలు