బీఎండబ్ల్యూ కొత్త కారు ఎక్స్‌ 5 లాంచ్‌

17 May, 2019 09:22 IST|Sakshi

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ  కొత్త కారు భారత మార్కెట్లో విడుదల చేసింది. తన న్యూ జనరేషన్‌ ఎక్స్‌5 ఎస్‌యూవీని గురువారం విడుదల చేసింది. మరింత ఆకర్షణీయంగా డామినేటింగ్‌గా  2019 వెర్షన్‌ను రూపొందించింది.  బీఎండబ్ల్యూ  బ్రాండ్‌ అంబాసిడర్‌  మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌,  బీఎండబ్ల్యూ ఇండియా  గ్రూప్‌   ప్రెసిడెంట్‌ హన్స్‌-క్రిస్టియన్‌  విడుదల చేశారు.

పెట్రోల్‌, ఇంజీన్‌ ఆప‍్షన్లలో  ఈ  సరికొత్త బీఎండబ్ల్యూ  ఎక్స్‌ 5 ను ఆవిష్కరించింది.  3.0 లీటర్  టర్బో చార్జ్‌డ్‌ 6 సిలిండర్ల ఇంజీన్‌,  8 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌ కామన్‌ ఫీచర్లుగా ఉన్నాయి.

డీజిల్‌  ఇంజీన్‌ 30డీ  స్పోర్ట్‌, 30 డీ ఎక్స్‌లైన్‌ అనే రెండువేరియంట్లలో లభ్యం కానుంది.  కాగా ప్రస్తుతం డీజిల్‌ వేరియంట్‌  మాత్రమే  సేల్‌కు సిద్దంగా ఉంది.  పెట్రోల్‌ వేరియంట్‌  ఈ ఏడాది చివరికి నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  బీఎండబ్ల్యూ ఇండియా 12 లాంచింగ్‌లతో   ఈ ఏడాది మార్కెట్లను ముంచెత్తనుంది. ఎక్స్‌2 ఎస్‌యూవీ , జెడ్‌ 4 స్పోర్ట్స్‌ కారు, 6 సిరీస్‌  తరువాత తాజాగా ఎక్స్‌ 5 ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భవిష్యత్తులో మరిన్ని కార్లను విడుదల చేయనుంది. ఈ జాబితాలో కొత్త 7 సీరీస్, 3 సిరీస్, ఎక్స్‌ 7 మొదలైనవి ఉన్నాయి.

ధరలు 
డీజిల్‌ వేరియంట్‌ రూ. 72.9 లక్షలు -రూ.82.4 లక్షల మధ్య( ఎక్స్ షో రూం  ఢిల్లీ)
పెట్రోల్‌ వేరియంట్‌ ధర   రూ. 82.4 లక్షల మధ్య  ( ఎక్స్ షో రూం  ఢిల్లీ)

కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న కార్లలో ఎక్స్‌5 మోడల్‌కు అమ్మకాల పరంగా మంచి స్థానం ఉండగా.. తాజాగా విడుదలైన ఈ ఎస్‌యూవీ  మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఈ,  వోల్వో ఎక్స్‌సీ90, ఆడీ క్యూ7 వంటి లగ్జరీ కార్లకు పోటీనిచ్చేదిగా ఉండనుందని సంస్థ ధీమా వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్‌ హాన్స్‌ క్రిస్టియన్‌ బార్ట్‌లెస్‌ మాట్లాడుతూ... ‘1999లో ఎక్స్‌5ను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌ విభాగాన్ని ప్రారంభించాం. ఆ తరువాత ఇది క్రమంగా బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా మారిపోయింది. తాజా ఎస్‌యూవీ విడుదల ఈ మోడల్‌ సక్సెస్‌ స్టోరీకి నూతన అధ్యాయంగా మారనుంది’ అని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు