సాక్షి... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

19 Jul, 2017 01:22 IST|Sakshi
సాక్షి... ‘ఫ్యూచర్స్‌’ సిగ్నల్స్‌!

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్‌ అండ్‌ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్‌? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్‌ ఇంట్రస్ట్‌ హెచ్చుతగ్గులు... కాల్, పుట్‌ రైటింగ్‌ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

ఐటీసీ: రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసిన ఐటీసీ షేరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల్లో ఆసక్తికరమైన బిల్డప్‌ జరిగింది. షేరు పతనంతోపాటు ఈ ఫ్యూచర్‌ ఓపెన్‌ ఇంట్రస్ట్‌ (ఓఐ) 6% పెరిగి 5.19 కోట్ల షేర్లకు చేరింది. స్పాట్‌ ధరతో పోలిస్తే ఫ్యూచర్‌ ప్రీమియం క్రితంరోజుకంటే రూ.0.50 మేర తగ్గింది. షేరు ధర తగ్గుదలతో పాటు ఓఐ పెరగడం, ప్రీమియం తగ్గడం వంటి సంకేతాలు షార్ట్‌సెల్లింగ్‌ను సూచిస్తున్నాయి. ఆప్షన్‌ కాంట్రాక్టులకు సం బంధించి రూ. 300, రూ. 290 స్ట్రయిక్స్‌ వద్ద భారీ కాల్‌రైటింగ్‌ జరిగింది.

రూ. 300 స్ట్రయిక్‌ వద్ద మంగళవారమే 70 లక్షల షేర్లు తాజాగా యాడ్‌కాగా, ఇక్కడ కాల్‌ బిల్డప్‌ 78 లక్షలకు చేరింది. రూ.290 స్ట్రయిక్‌ వద్ద 42 లక్షల మేర కాల్‌ బిల్డప్‌ జరిగింది. కానీ రూ.280 వద్ద పుట్‌ రైటింగ్‌.. కాల్‌ రైటింగ్‌ అంత బలంగా లేదు. సమీప భవిష్యత్తులో ఐటీసీ రూ.300 స్థాయి దాటడం కష్టసాధ్యమని, రూ.290 దిశగా పెరిగితే అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని డేటా చెబుతోంది.
మరి బ్యాంక్‌ నిఫ్టీ డేటా ఏం చెబుతోంది?
ఎస్‌బీఐ ఫ్యూచర్‌ సంకేతాలెలా ఉన్నాయి?
ఈ వివరాలు www.sakshibusiness.comలో

మరిన్ని వార్తలు