భారత్‌లో తొలిసారిగా శామ్‌సంగ్ కర్వ్‌డ్ టీవీలు

8 May, 2014 01:27 IST|Sakshi
భారత్‌లో తొలిసారిగా శామ్‌సంగ్ కర్వ్‌డ్ టీవీలు

ధరలు రూ. 1-4.49 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ:  శామ్‌సంగ్ కంపెనీ భారత మార్కెట్లోకి కర్వ్‌డ్ టీవీలను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ. 1.04 లక్షల నుంచి రూ.4.49 లక్షల  రేంజ్‌లో ఉన్నాయని శామ్‌సంగ్ ఇండియా ఎండీ(సేల్స్) ఎస్.కె. కిమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ నేపథ్యంలో హై-ఎండ్ కొనుగోలుదారులు లక్ష్యంగా ఈ టీవీలను మార్కెట్లోకి తెస్తున్నామని పేర్కొన్నారు. కర్వ్‌డ్ రేంజ్‌లో మొత్తం పది టీవీలను అందిస్తున్నామని వివరించారు.

 వీటిల్లో ఆల్ట్రా హై డెఫినిషన్(యూహెచ్‌డీ), ఎల్‌ఈడీ టెక్నాలజీ టీవీలున్నాయని పేర్కొన్నారు. పూర్తి హై డెఫినిషన్ టీవీలతో పోల్చితే ఈ కర్వ్‌డ్ టీవీల రిజల్యూషన్, పిక్సెల్స్ నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని వివరించారు. టీవీ వీక్షణంలో కర్వ్‌డ్ టీవీ కొత్త విప్లవం సృష్టించనున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు