శాంసంగ్‌ ‘ఫోల్డ్‌’ వస్తోంది

25 Sep, 2019 08:35 IST|Sakshi

అక్టోబరు 1న భారత మార్కెట్‌కు...

ధర సుమారు రూ.1.50 లక్షలు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచంలో తొలిసారిగా ఫోల్డబుల్‌ మొబైల్‌ డివైస్‌ను ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ అభివృద్ధి చేసింది. గెలాక్సీ ఫోల్డ్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్‌గానూ, ట్యాబ్లెట్‌ పీసీగా నూ వినియోగించుకునే వీలుగా ఈ ఉపకరణాన్ని తయారు చేసింది. మొత్తం ఆరు కెమెరాలు పొందుపరిచారు. ఉపకరణం తెరిచినప్పుడు 7.3 అంగు ళాల తెరతో ట్యాబ్లెట్‌ పీసీ మాదిరిగా, మూసినప్పు డు 4.6 అంగుళాల తెరతో స్మార్ట్‌ఫోన్‌ వలె ఉపయోగించొచ్చు. 5జీ టెక్నాలజీతో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 7 నానోమీటర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ఆక్టాకోర్‌ చిప్‌ వంటి ఫీచర్లున్నాయి. 4,380 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

వారం రోజుల్లో భారత్‌కు..:శాంసంగ్‌ ఈ నూతన ఉపకరణాన్ని దక్షిణ కొరియాలో ఇటీవలే ఆవిష్కరించింది. యూఎస్‌లో ఈ నెల 27న అడుగుపెడుతోంది. భారత మార్కెట్లో అక్టోబరు 1న విడుదలకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్‌ ధర సుమారు రూ.1.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. గ్యాడ్జెట్‌ కావాల్సినవారు ముందుగా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన ఔట్‌లెట్లలో కూడా లభిస్తుంది. స్పేస్‌ సిల్వర్, కాస్మోస్‌ బ్లాక్‌ రంగుల్లో రూపొందించారు.

>
మరిన్ని వార్తలు