భారీ కెమెరాతో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌

28 Sep, 2019 19:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా కంపెనీలకు పోటీగా శాంసంగ్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘గెలాక్సీ ఏ70 ఎస్‌’ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 64 మెగా పిక్సెల్‌ భారీ కెమెరా కలిగివుండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. శాంసంగ్‌ ఫోన్లలో ఇంత పెద్ద కెమెరా కలిగివుండడం ఇదే మొదటిసారి. సెల్పీల కోసం 32 మెగా పిక్సల్‌ కెమెరా, 512 జీబీ వరకు పెంచుకునే ప్రాసెసర్‌ను అమర్చారు. చీకటిలోనూ స్పష్టమైన ఫొటో, సూపర్‌ స్టడీ వీడియో తీసేందుకు అనువుగా ఫీచర్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైమ్‌-సీతో వేగంగా చార్జింగ్‌ కాగలదు. 6జీబీ, 8జీబీ వేరియంట్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. సెక్యురిటీ కోసం పింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను పొందు పరిచారు. గేమింగ్‌ ప్రియులకు మరింత మజా వచ్చేలా ఏఐ ఆధారిత ‘గేమ్‌ బూస్టర్‌’ను ఉంచారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా ‘గెలాక్సీ ఏ70 ఎస్‌’ను కొనుగోలు చేయొచ్చు.

ఇతర ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ, ఇన్ఫినిటీ, యూ-డిస్‌ప్లే
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 675 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
యూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌ 9 పైయి
64+8+5 ఎంపీ ట్రిపుల్ కెమెరా
32 మెగా పిక్సల్‌ సెల్పీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర : 28,999
8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర : 30,999

మరిన్ని వార్తలు