వీడియో చూస్తూ చాటింగ్‌

22 May, 2018 00:50 IST|Sakshi

వినూత్న ఫీచర్లతో శాంసంగ్‌ ఫోన్లు

ధరల శ్రేణి రూ.13,990 – 25,990  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో తాజాగా ఏ6, ఏ6 ప్లస్, జే6, జే8 మోడళ్లను సోమవారం ఆవిష్కరించింది. ధరల శ్రేణి రూ.13,990 నుంచి రూ.25,990 మధ్య ఉంది. దుకాణాల్లో పేటీఎం మాల్‌ ద్వారా చెల్లిస్తే రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. భారత్‌లో తొలిసారిగా చాట్‌ ఓవర్‌ వీడియో ఫీచర్‌ను వీటిలో పొందుపరిచారు.

ఒకవైపు వీడియో చూస్తూనే మరోవైపు చాటింగ్‌ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత.  ఇన్ఫినిటీ డిజైన్‌తో స్క్రీన్‌ సైజు 15 శాతం పెరిగింది. ఆన్‌డ్రాయిడ్‌ 8.0 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. 256 జీబీ వరకు సపోర్ట్‌ చేసే మైక్రో ఎస్‌డీ స్లాట్‌ ఉంది. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా ఉంది.  కొత్త మోడళ్ల రాకతో ఈ ఏడాది కంపెనీ మార్కెట్‌ వాటా ప్రస్తుత 42 శాతం నుంచి  47 శాతానికి చేరుతుందని శాంసంగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ వాలియా  తెలిపారు.

గెలాక్సీ ఏ6 : 5.6 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్, 16 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ.  ధర రూ.21,990/22,990.
గెలాక్సీ ఏ6+ : 6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్, 16 ఎంపీ+5 ఎంపీ కెమెరాలు, 24 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ. ధర రూ.25,990.
గెలాక్సీ జే6 : 5.6 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్, 13 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, పాలీకార్బొనేట్‌ యూనిబాడీ. ధర రూ.13,990/16,490.
గెలాక్సీ జే8 : 6 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్, 16 ఎంపీ+5 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ. ధర రూ.18,990.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు