శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లు వచ్చేశాయ్‌..ఆఫర్లు కూడా

20 Aug, 2019 14:58 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ మేడిన్‌ఇండియా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో మంగళవారం లాంచ్‌  చేసింది. శాంసంగ్ గెలాక్సీ నోట్‌ సిరీస్‌లో భాగంగా  గెలాక్సీ  నోట్‌ 10, నోట్‌ 10 ప్లస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలను వరుసగా రూ. 69,990, రూ.79,990గా నిర్ణయించింది. తద్వారా యాపిల్‌, గూగుల్‌ లకు షాక్‌ ఇచ్చింది. భారత్‌లో ఆరా బ్లాక్‌, ఆరా గ్లో, ఆరా వైట్ రంగుల్లో  వీటిని విడుదల చేసింది. ఆగస్టు 22వరకు ప్రధాన రీటైల్‌ దుకాణాలు సహా ఈ-కామర్స్‌ సైట్లలో ప్రీ బుక్‌ సదుపాయం  అందుబాటులో ఉంటుంది. విక్రయాలు  ఆగస్టు 23 నుంచి ప్రారంభం.

ఇక ఆఫర్ల విషయానికి వస్తే గెలాక్సీ నోట్ 10-సిరీస్ కొనుగోలుదారులు యూట్యూబ్ ప్రీమియం ఆరు నెలల సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అలాగే ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులు గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను దాని అసలు అమ్మకపు ధర రూ .19,990 కు బదులుగా రూ .9,999 తగ్గింపుతో పొందవచ్చు.  లేదా  గెలాక్సీ బడ్స్‌ను దాని అసలు ధర ట్యాగ్ 9,999 కు బదులుగా రూ .4,999 కు కొనుగోలు చేయవచ్చు. రీటైల్‌ దుకాణాలు, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ప్రీ బుక్‌ చేసుకొనే వారికి రూ.6 వేల వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ రానుంది. మిగిలిన ఈ-కామర్స్‌ సైట్లలో ఐసీఐసీఐ బ్యాంకు కార్డులకు ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు శాంసంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ ఆఫర్లతో నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్‌ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లను ఇప్పటికే న్యూయార్క్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 

గెలాక్సీ నోట్‌ 10 ఫీచర్లు
6.3 అంగుళాల డిస్‌ప్లే
శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 9 పై 
1080x2280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ ర్యామ్‌+256 జీబీ
10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
12+16+12 ఎంపీ వెనుక కెమెరా
 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర : రూ.69,999 (8జీబీ ర్యామ్‌+256 జీబీ)

గెలాక్సీ నోట్‌ 10 ప్లస్‌ ఫీచర్లు
6.8 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 9 పై 
1440x3040 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌
10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
12+16+12+0.3 ఎంపీ వెనుక కెమెరా
4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 ధర :  రూ.79,999 (12జీబీ+256జీబీ)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు