గెలాక్సీ నోట్‌ 9పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌

14 Aug, 2018 16:51 IST|Sakshi
శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌

అదిరిపోయే ఫీచర్లతో, ఆకర్షణీయమైన రూపురేఖలతో శాంసంగ్‌ తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 9ను గత వారమే మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ బిగ్‌-స్క్రీన్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ గెలాక్సీను కొనుగోలు చేయాలని భావించే వారికి, ఈ డివైజ్‌ ప్రీ-ఆర్డర్లపైనే పేటీఎం మాల్‌  కోంబో డీల్‌ను ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9పై ఫ్లాట్‌ 6000 రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేసింది. ఈ డిస్కౌంట్‌ పేటీఎం వాలెట్లలో క్యాష్‌బ్యాక్‌ రూపంలో కస్టమర్లు పొందనున్నారు. డివైజ్‌ కస్టమర్‌ వద్దకు చేరాక 12 రోజుల అనంతరం ఈ క్యాష్‌బ్యాక్‌ను క్రెడిట్‌ చేయనున్నట్టు పేటీఎం మాల్‌ తెలిపింది. దాంతో పాటు పేటీఎం మాల్‌లో గెలాక్సీ నోట్‌ 9 బుక్‌ చేసుకున్న వారికి శాంసంగ్‌ గేర్‌ స్పోర్ట్‌ స్మార్ట్‌వాచ్‌పై రూ.18,000 డిస్కౌంట్‌ లభించనుంది. కోంబో ఆఫర్‌లో భాగంగా శాంసంగ్‌ గేర్‌ స్పోర్ట్‌ను కేవలం రూ.4,999కే అందిస్తుంది.

అదేవిధంగా తొమ్మిది నెలల పాటు నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అయితే శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది? దాని ధరెంత ఉంటుంది? అనే విషయాలపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. 

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 ఫీచర్లు...
6.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
క్వాడ్‌ హెచ్‌డీప్లస్‌ రెజుల్యూషన్‌
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టా-కోర్‌ ఎక్సీనోస్‌ 9810 ప్రాసెసర్‌
6 జీబీ/8 జీబీ ర్యామ్‌ 
128 జీబీ‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరో 512 జీబీ స్టోరేజ్‌ పెంపు
అంటే మొత్తంగా 1 టీబీ స్టోరేజ్‌ అందుబాటు
12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
 ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
 సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌
 ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌
 డాల్బీ అట్మోస్
 ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌
 ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌

>
మరిన్ని వార్తలు