శాంసంగ్‌ ఆన్‌ నెక్ట్స్‌ కొత్త వేరియంట్‌...డిస్కౌంట్‌ ధరలో

1 Jan, 2018 20:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను  లాంచ్‌ చేసింది. గెలాక్సీ సిరీస్‌లో ని  శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌  లో కొత్త వేరియంట్‌ (16జీబీ)ను  ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది.    దీని ప్రారంభ ధర రూ.10,999గా నిర్ణయించింది. అయితే ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 3 -5 మధ్య  బొనాంజా సేల్స్‌లో విక్రయించనుంది.  ఈ పరిమిత కాల ఆఫర్‌లో రూ.9,999కే అందిస్తోంది.  కాగా 2016లో గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌  32జీబీ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది.

గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌  ఫీచర్స్‌
5.5 అంగుళాల  డిస్‌ప్లే
2.5డి గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
1.5 ఆక్టాకోర్‌ ఎక్సినోస్‌ 7870 ప్రాసెసర్‌
3 జీబీ ర్యామ్‌
16జీబీ స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే సదుపాయం
13 మెగా పిక్సెల్‌ కెమెరా
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
 

మరిన్ని వార్తలు